రేపిస్టులపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. వారిపై దయ చూపాల్సిన అవసరం లేదని అన్నారు. మహిళల భద్రత అనేది చాలా ముఖ్యమైన విషయమని పేర్కొన్నారు. అత్యాచార కేసుల్లో క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునే అవకాశం కూడా ఉండొద్దని అన్నారు. పోక్సో చట్టం కింద అత్యాచార నిందితులుగా నిర్ధారించబడిన వారికి క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసే అర్హత లేదని.. క్షమాభిక్ష పిటిషన్లపై పార్లమెంట్ పునఃసమీక్షించాలన్నారు.