జైళ్లలో గోశాలలు ఏర్పాటు చేస్తే ఉపయోగం ఇదే : మోహన్ భగవత్

Update: 2019-12-09 01:09 GMT

నేరస్తుల్లో పరివర్తన తీసుకురావాలన్నదే చట్టాలు చెబుతున్న ప్రాధమిక సూత్రం. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైనా శిక్షతో జైలు జీవితం అనుభవించాల్సి వస్తే అతను మరింత రాటుదేలిపోతున్నాడు. మార్పు చెందినట్లు ఏమార్చటమే తప్ప నిజానికి జైలు శిక్ష లక్ష్యం మాత్రం నెరవేరట్లేదు. అందుకే క్రిమినల్స్ పదే పదే నేరాలకు తెగబడుతున్నారు. అయితే..వీహెచ్పీ చీఫ్ మోహన్ భగవత్ మాత్రం ఖైదీల్లో పరివర్తన తీసుకొచ్చేందుకు ఓ కొత్త మార్గం దిశానిర్దేశం చేశారు. గో సేవతో ఖైదీల హృదయాల్లో కరుకుతనం పోయి సున్నితత్వం రావటం ఖాయమని అంటున్నారాయన. అంతేకాదు ప్రతీ జైలులోనూ గోశాలను ఏర్పాటు చేయాలని కూడా సూచించారు.

గోవు ఈ బ్రహ్మాండానికి గోవు తల్లిలాంటిదని, అది సమస్త జంతు జాలాన్ని పోషిస్తుందని అంటున్నారు మోహన్ బగవత్. అలాగే మానవుని హృదయ వికాసానికి గో సేవ తోడ్పాటు తుందని అన్నారు. అందుకే ఖైదీలలో మానసిక పరివర్తన కోసం దేశ వ్యాప్తంగా ఉ‍న్న జైళ్లలో గోశాలలను ప్రారంభించాలని మోహన్‌ భగత్‌ సూచించారు. ఆవుల ఆలనాపాలనా చూడడం వల్ల ఖైదీల మెదళ్లు, మనసులలో క్రూరత్వం తగ్గుతుందని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ఆధారాలతో సహా కొందరు అధికారులకు తెలియజేశానని పేర్కొన్నారు.

గో సేవ తర్వాత ఖైదీల మానసిక పరిస్థితి మారుతుందని అంతర్జాతీయ సమాజం ముందు ఆవిష్కరించేందుకు కొన్ని సూచనలు చేశారు భగవత్. ఆవుల పెంపకానికి ముందు, ఆ తర్వాత ఎలా ఉందనేది మానసిక నిపుణులతో శాస్త్రీయంగా అధ్యయనం చేయించాలని అన్నారు. ఆ తర్వాత వాటిని రికార్డు చేసి డాక్యుమెంటేషన్‌ చేయాలట. ఇలా వేలాది జైళ్ల నుంచి ఒకే రకమైన ఫలితాలతో రిపోర్టులు వస్తే ఆ నివేదికలను సారాంశాన్ని అంతర్జాతీయ సమాజం ముందు ఆవిష్కరించవచ్చని తెలిపారు.

Similar News