మహిళను దేవతగా కొలుచే భూమి ఇది. దయామూర్తి, ఆపదలో ఆదిపరాశక్తిగా మహిళకు మహోన్నత స్థానం ఇచ్చిన సంస్కృతి మనదే. పితృస్వామ్య వ్యవస్థే అయినా.. మాతృమూర్తులకు ఉండే గౌరవం అతీతం. కానీ, ఇవన్ని చెప్పుకోవటానికి, వినటానికే అన్నట్టుగా మారింది. నెలల పసిపాప నుంచి కాటికి కాలు చాపిన ముసలి వరకు ఎవ్వర్ని వదలకుండా అఘాయిత్యాలకు పాల్పడిన ఘటనలు కోకొల్లలు. పుణ్యభూమిగా చెప్పుకునే ఈ నెల అత్యాచారాల భూమిగా మిగిలిపోయింది. ఈ అత్యాచార ఘటనల్లో ఉన్నావ్ ప్రథమ స్థానంలో ఉంది.
ఉన్నావ్. యూపీలోని ఓ ప్రాంతం. తమన దేశ రాజధాని ఢిల్లీ అయితే..ఉన్నావ్ అత్యాచారాల రాజధాని. ఇక్కడ అత్యారానికి తెగబడిన పశువుల కంటే బాధితులకే ముందుగా శిక్ష పడుతుంది. నెంబర్ ప్లేట్ లేని లారీ వచ్చి గుద్ది వెళ్లే. విచారణకు వెళ్తున్న అత్యాచార బాధితురాలిని కిరోసిన్ పై తగులబెట్టిన ఘటనలు కూడా ఇక్కడే జరుగుతుంది. రౌడీ షీటర్లు పేరుతో దాదాపు 5 వేల వరకు ఎన్ కౌంటర్లు జరిగిన ఈ ప్రాంతంలో రేపిస్టులకు మాత్రం అడ్డుఅదుపులేనంత బరితెగింపు స్వేచ్చ ఉంది.
ఉన్నావ్ లో ఈ ఏడాది జనవరి నుంచి నవంబరు వరకు ఉన్నావ్‌లోనే 86 అత్యాచార కేసులు నమోదయ్యాయి. మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి 185 కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు 63 కిలోమీటర్ల దూరంలో 30 లక్షల మంది జనాభా ఉన్న ప్రాంతంలో ఇన్ని అత్యాచారా కేసులు నమోదవటంపై విస్తు గొలుపుతున్నాయి గణాంకాలు. ఈ కేసులు జిల్లాలోని అశోహ, అజ్గెయిన్, మఖి, బంగరమౌ ప్రాంతాల్లో జరిగాయి. అత్యాచార కేసుల్లో అత్యథిక కేసుల్లో నిందితులు ఇప్పటికే బెయిల్ పై బయటికొచ్చారు. అంతేకాదు..అఘాయిత్యాకు పాల్పడిన వారిలో చాలా మంది పారారీలో ఉన్నారు. రౌడీలే లక్ష్యంగా జరిగిన ఎన్ కౌంటర్ లో బుల్లెట్ల మోత మొగిస్తోంది యూపీ పోలీస్. దాదాపు 5 వేల వరకు ఎన్ కౌంటర్లు జరిగిన రాష్ట్రంలో అత్యాచారాలకు ఒడిగడుతున్న నిందితులను శిక్షించటంలో మాత్రం వెనకడుగు వేస్తోంది యూపీ ప్రభుత్వం.
యూపీలో అత్యాచారాలకు ప్రధాన కారణం..ఇక్కడి నేరాలు రాజకీయమవుతున్నాయి. తమదైన ప్రయోజనాల కోసం నేరాలను రాజకీయ నాయకులు ఉపయోగించుకుంటున్నారు. అందుకే ఉన్నావ్ తరహా గంటలు పునరావృతం ఆయినా అశ్చర్యపోవాల్సిన ప్రమాదం లేదు.