కలెక్టరేట్‌లో కిరోసిన్‌ పోసుకొని పాడి రైతు ఆత్మహత్యాయత్నం

Update: 2019-12-10 03:46 GMT

కడప కలెక్టరేట్‌లో పాడి రైతు కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సబ్సిడీ లోన్‌ పెండింగ్‌లో ఉందని అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా స్పందన రాలేదని మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ప్రొద్దుటూరుకు చెందిన పాడి రైతు వెంకటరమణ కలెక్టరేట్‌లో ఆత్మహత్యాయత్నం చేశాడు. అప్రమత్తమైన పోలీసులు అడ్డుకున్నారు.