నామినేటెడ్ పోస్టుల విషయంలో టీడీపీ ఎమ్మెల్యేల ఆరోపణలపై ఘాటుగా స్పందించారు సీఎం జగన్. వక్రీకరణలో టీడీపీని మించినవారు లేరని మండిపడ్డారు. నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన రాష్ట్రం ఏపీ మాత్రమేనని వివరణ ఇచ్చారు. తెలుగు అకాడమీ చైర్మన్‌గా చంద్రబాబు అత్తగారైన లక్ష్మీపార్వతిని నియమించామని జగన్ సెటైర్ వేశారు. ఆమెకు పదవిని మీరివ్వలేకపోయారని, మేం ఇచ్చామని జగన్ వ్యాఖ్యానించారు.