వైఎస్‌ వివేకా హత్య కేసులో నా పాత్ర ఉందని నిరూపిస్తే ఉరికైనా సిద్ధం : ఆదినారాయణరెడ్డి

Update: 2019-12-11 05:14 GMT

వైఎస్‌ వివేకా హత్య కేసు విచారణ రాజకీయంగానూ అగ్గి రాజేస్తోంది. ఈ కేసులో తన పాత్ర ఉందని నిరూపిస్తే ఉరికైనా సిద్ధమన్నారు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి. నాడు సిట్ వద్దని కోరిన YCP.. ఇప్పుడు కేసును CBIకి ఎందుకు అప్పగించడం లేదని ప్రశ్నించారు. తాను అజ్ఞాతంలో లేనని డిసెంబర్ 6న విచారణకు హాజరుకావాలని జమ్మలమడుగు డీఎస్పీ ఫోన్ చేసినప్పుడు తాను ఢిల్లీలో ఉన్నానని చెప్పారు. ఈ కేసులో విచారణకు హాజరైన వారికి 61ఏ కింద నోటీసులు ఇచ్చారని.. తనకు మాత్రమే 161 సీఆర్సీ కింద నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు.

Similar News