ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడాన్ని జనసేన అధినేత పవన్ తీవ్రంగా తప్పు పడుతున్నారు. కానీ అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.. ఏపీ సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతించారు. చంద్రబాబు ప్రభుత్వం మధ్యలో వదిలేసిన ఇంగ్లీష్ మీడియాన్ని జగన్ ప్రభుత్వం కొనసాగించే ప్రయత్నం చేస్తోందని రాపాక చెప్పారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదన్నారు. పేద విద్యార్థుల కోసం వైసీపీ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు.