రేపు కాకినాడలో జేఎన్టీయుకు ఎదురుగా పవన్ దీక్ష

Update: 2019-12-11 00:39 GMT

ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న పవన్..మరో దీక్షకు సిద్ధమయ్యారు. తూర్పుగోదావరి, రాయలసీమ జిల్లాల పర్యటనలో రైతు సమస్యల్ని తెల్సుకున్న పవన్ కళ్యాణ్.. రేపు కాకినాడలో ఒక రోజు దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. కాకినాడ జేఎన్టీయుకు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో దీక్ష చేపట్టబోతున్నారు. ఈ దీక్షకు రైతు సౌభాక్య దీక్షగా పేరు పెట్టిన జనసైన్యం దీక్షకు సంబంధించిన బ్రౌచర్ విడుదల చేశారు.

అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిన రాష్ట్రంలో రైతులు అప్పుల పాలవుతున్నారన్నారని అవేదన వ్యక్తం చేశారు జనసేనాని. వరి పంట వేయడానికే రైతులు భయపడేలా ప్రభుత్వ విధానాలుంటున్నాయని విమర్శించారు. గిట్టుబాటు ధర లేక, ఖర్చలు వరకైనా డబ్బులు రాబట్టుకోలేక రైతులు ప్రతినిత్యం కష్టాలు అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రైతుల సమస్యలు ప్రభుత్వానికి గట్టిగా తెలియజేసేందుకే రేపు ఒక రోజు దీక్ష చేయబోతున్నట్లు జనసేన నేతలు చెబుతున్నారు.

Similar News