ఏపీ అసెంబ్లీలో అధికార-విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడాన్ని తాము వ్యతిరేకించడం లేదని.. తెలుగుకి అన్యాయం జరుగుతోందని మాత్రమే తాము విమర్శిస్తున్నామని టీడీపీ వివరణ ఇచ్చింది. తెలుగు భాషకు జగన్ అన్యాయం చేస్తున్నారంటూ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు హాయంలో తన బంధువుల కోసం ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు..