ఆయన తరువాత గొల్లపూడి మాత్రమే అలా..

Update: 2019-12-12 10:13 GMT

1939 ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించారు గొల్లపూడి. ఆయన పుట్టి పెరిగింది విజయనగరం. చదువుకున్నది విశాఖపట్నం. ఆదునిక నాటకానికి అడుగులు దిద్దిన గురజాడ బాటలో ఆయన నడక సాగింది. మానవ ప్రవృత్తిలోని వివిధ పార్శ్వాలు రచయితగా అబ్జర్వ్ చేసిన గొల్లపూడికి నటుడుగా విభిన్న పాత్రలు పోషించడానికి తోల్పడింది. గొల్లపూడి నటనలో ఓ నిండుతనం ఉంటుంది. డైలాగ్ మీద పట్టు ఉంటుంది. అద్భుతమైన మాడ్యులేషన్ ఉంటుంది. ఈ టాలెంట్ ను తమిళ దర్శకుడు విసు బాగా పట్టుకున్నాడు. ఫైటింగులు చేసే విలనీ కాదు.. జస్ట్ అలా కూల్ గా మాట్లాడుతూ అపారమైన దుర్మార్గం గుప్పించే పాత్రలు పోసించాలంటే చాలా టాలెంట్ కావాలి. అధికారం కావాలి. నాగభూషణం చేయగలిగేవాడు. పాత్రకు న్యాయం చేయడానికి ఒక్కోసారి స్వతంత్రించేవారు కూడా. గొల్లపూడిలో మళ్లీ ఆ స్థాయి నటుడు కనిపిస్తాడు. చిరంజీవి చాలెంజ్ మూవీలో స్మిత భర్త పాత్రలో గొల్లపూడి ఆ తరహా విలనీ అద్భుతంగా పండించాడు.

విస్తృతమైన తన అనుభవాల సారాన్ని అమ్మ కడుపు చల్లగా పేరుతో ప్రచురించారు గొల్లపూడి. ఆయన బాగా ఔట్ స్పోకెన్. ఎటువంటి దాపరికాలూ ఉండవు. తన మనసులో అనిపించింది రాసేస్తారు. అందుకే ఆయన అంత విస్తృతంగా రాసేస్తారు. రాయడానికి చాలా ఇష్టపడతారు. ఇంటర్ నెట్ లో కూడా అంత విస్తారంగా రాసిన రచయితలు అరుదు.

అదీ మారుతీయం. వయసు పెరిగిన తర్వాత అడపాదడపా గౌరవ ప్రదమైన పాత్రల్లో కనిపిస్తూ వస్తున్న గొల్లపూడి మారుతీ రావు గురువారం అనారోగ్యంతో మరణించడం సినీ కళామతల్లికి తీరని లోటు. గొల్లపూడి మారుతీరావు మరణంతో సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగింది. అయితే ఆయన లేకపోయినా...ఆయన నటించిన సినిమాలు,

రచనలు ద్వారా తెలుగు వారి గుండెల్లో ఎప్పటికీ సజీవంగా నిలిచే ఉంటారు.

Similar News