తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలో విషాదం నెలకొంది. వాహన మండపం వద్ద లారీ కింద పడి ఓ భక్తుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రమాదవశాత్తు జరిగిందేమోనని పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తూ.. సీసీ ఫుటేజ్‌లు పరిశీలించారు. అయితే సీసీ ఫుటేజ్‌లలో మాత్రం భక్తుడే వెనుక టైర్లు కింద పడినట్లు స్పష్టంగా కనిపించింది. మృతుడు చెన్నై వాసిగా గుర్తించారు. తిరుమలలో చనిపోతే వైకుంఠానికి చేరుకుంటారన్న విశ్వాసంతోనే ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. భక్తులు మూఢనమ్మకాలు వదిలి పెట్టాలని.. ఇలా చేయడం మంచిది కాదని TTD ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.