ఈ నెల 14, 15న ఆసిఫాబాద్ జిల్లాలో బర్డ్ వాక్ ఫెస్టివల్

Update: 2019-12-13 02:43 GMT

దట్టమైన అడవులు, అందమైన కొండలు, జలపాతాలతో కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా అందమైన ప్రకృతికి నిలయంగా మారింది. లాంగ్‌ బిల్డ్‌ రాబందు, కామన్ కింగ్‌ ఫిషర్‌, ఇండియన్‌ రోలర్‌, అముర్ఫాల్కన్‌, రోజ్‌ రింగర్‌, పారాకీట్‌ వంటి వివిధ రకాల పక్షులు పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పక్షి ప్రేమికుల సాయంతో ఆయా గ్రామాల్లో జీవవైవిధ్య పరిరక్షణపై అవగాహన కల్పించాలని అటవీ అధికారులు ప్రణాళికలు రూపొందించారు.

జిల్లాలో పక్షి జాతుల అధ్యయనం కోసం ఈనెల 14, 15 తేదీల్లో బర్డ్‌ వాక్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో విభిన్న జాతుల పక్షులు కనిపిస్తున్నాయని.. ఇప్పటి వరకు 270 రకాల పక్షులను గుర్తించామని ఆయన చెప్పారు. ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు వివిధ రకాల పక్షులను చూడటానికి, జీవవైవిధ్య పరిరక్షణ కోసం గ్రామాల్లో అవగాహన కల్పించేందుకు అధికారులు ఈ ఉత్సవాన్ని ప్లాన్‌ చేశారు. ఇప్పటి వరకు మహారాష్ట్ర, మంచేరియల్‌, ఆదిలాబాద్‌ నుంచి 150 మంది పక్షి ప్రేమికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ బర్డ్‌ వాక్‌ ఫెస్టివల్‌ కాగజ్‌నగర్‌, పెంచికల్పెట్‌, సిర్పూర్‌, తిర్యాణి ప్రాంతాల్లో జరుగుతుంది. ఈ ఫెస్టివల్‌ను గత మూడేళ్లగా నిర్వహిస్తున్నట్లు జిల్లా డీఎఫ్‌వో రంజిత్‌ నాయక్‌ చెప్పారు.

Similar News