పెరిగిన ఉల్లి ధరలతో జనం బెంబేలెత్తుతున్నారు. కట్ చెయ్యకుండా ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఉల్లిపై యాడ్‌లే కనిపిస్తున్నాయి. పశ్చిమగోదావరిలో ఓ వ్యాపరి నిజంగానే ఉల్లి ప్రియులకు బంపర్ ఆఫర్ ప్రకటించాడు. ఇటీవల ఓ చికెన్ షాపు ఓపెన్ చేసిన ఆయన.. ఒక కేజీ కోడిమాంసం కొంటే అరకేజీ ఉల్లిపాయలు ఉచితం అంటూ బోర్డు పెట్టాడు.
తణుకు పట్టణంలోని పైడిపర్రు సెంటర్‌లో చిలుకూరి సత్యనారాయణ అనే వ్యాపారీ నూతనంగా చికెన్ సెంటర్ ప్రారంభించాడు. ప్రజలను ఆకట్టుకునేందుకు ఇలా కొత్త ఆఫర్ పెట్టాడు. ఉల్లి ఫ్రీగా వస్తుండడంతో జనం కూడా చికెన్ కోసం ఎగబడుతున్నారు.