అధికార, ప్రతిపక్షం మధ్య రివర్స్ టెండరింగ్ మరోసారి మాటల యుద్ధానికి కారణమైంది. రివర్స్ టెండరింగ్ తో ప్రభుత్వానికి 14 వందల కోట్లు మిగిల్చామని అధికార పార్టీ చెబుతున్నారు. అయితే..అది రివర్స్ టెండరింగ్ కాదని రిజర్వ్ టెండరింగ్ అని ఆరోపించారు చంద్రబాబు.
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రివర్స్ టెండరింగ్ పై శుక్రవారం వాడివేడి చర్చ జరిగింది. రివర్స్ టెండరింగ్ తో మేం ప్రజాధనాన్ని మిగిల్చామని అధికార పార్టీ. కాదు.. మీకు అనుకూలమైన వ్యక్తులకు కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకే రివర్స్ టెండరింగ్ ప్రక్రియ చేపట్టారని ప్రతిపక్ష పార్టీ విమర్శించుకున్నాయి.
రివర్స్ టెండరింగ్‌తో 14 వందల కోట్ల రూపాయలు ఆదా చేశామన్నారు ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. పోలవరంలో 750 కోట్ల రూపాయలు మిగిల్చామని చెప్పారు. పనుల్లో పారదర్శకత కోసం ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని.. పనుల్లో పారదర్శకత కోసం ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అసెంబ్లీలో చెప్పారు అనిల్.
వైసీపీ ప్రభుత్వం చేస్తున్నది రివర్స్ టెండరింగ్ కాదు.. రిజర్వ్ టెండరింగ్ అని ఆరోపించారు చంద్రబాబు. సభ అనంతరం ప్రెస్ మీట్ లో మాట్లాడిన చంద్రబాబు ప్రభుత్వం తీరుపై ఫైర్ అయ్యారు. ఇష్టారాజ్యంగా పనులు కట్టబెడుతూ.. డబ్బులు ఆదా చేశామని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.
అటు సభలోనూ ప్రభుత్వం తీరును తప్పుబట్టింది టీడీపీ. రివర్స్ టెండరింగ్ వెనక తమ వారికి లాభం చేకూర్చే కుట్ర జరిగిందన్నది ప్రతిపక్ష సభ్యుల వాదన. ముందుగానే కాంట్రాక్ట్ సంస్థను రిజర్వ్ చేసుకొని వారికే పనులు అప్పగించారని ఆరోపించారు. అందుకే అది రిజర్వ్ టెండరింగ్ అని విమర్శించారు.
టీడీపీ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి బుగ్గన.. గత ప్రభుత్వం చేసిన అవినీతి వల్లే రివర్స్ టెండరింగ్‌కు వెళ్లామని.. వేల కోట్ల రూపాయలు ఆదా చేశామన్నారు. రివర్స్ టెండరింగ్ అంటేనే ధరలు తగ్గుతూ వస్తాయని వివరించారు.
గత ప్రభుత్వాలు పర్సెంటీజీల లెక్కన కొందరు కాంట్రాక్టర్ల జేబులు నింపాలని చూశారని.. తాము అదే డబ్బుతో తాము అగ్రి గోల్డ్ బాధితులకు న్యాయం చేశామని వైసీపీ అంటోంది. అయితే..పోలవరం దగ్గర్నుంచి అన్ని ప్రాజెక్టుల్లోనూ నలుగురైదుగురి కోసమే వైసీపీ రివర్స్ టెండరింగ్ పేరుతో కుట్ర చేస్తుందని టీడీపీ ఎదురుదాడికి దిగింది.