యాదాద్రి భువనగిరి జిల్లా హజీపూర్ బాధితులు రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైను కలిసారు. గ్రామానికి చెందిన ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన శ్రీనివాసరెడ్డికి ఉరిశిక్ష పడేలా చూడాలని కోరారు. కేసు త్వరగా తేలి దోషికి ఉరిశిక్ష పడితేనే తమకు న్యాయం జరిగినట్టు అవుతుందని అన్నారు. అలాగే.. హజీపూర్ నుంచి వేరే గ్రామానికి వెళ్లేందుకు సరైన లింక్ రోడ్డు లేదని, వాగు దాటి వెళ్లేందుకు బ్రిడ్జి నిర్మించేలా చూడాలని గవర్నర్‌ను కోరారు.