నడిరోడ్డు మీద ప్రేమించిన యువతిపై..

Update: 2019-12-16 06:12 GMT

బెంగళూరు శివారులో ఓ యువకుడు రెచ్చిపోయాడు. ప్రేమించిన యువతిపై దాడి చేశాడు. నడిరోడ్డుపైనే చెయ్యి చేసుకున్నాడు. నోటికొచ్చినట్టు తిట్టాడు. మహాలక్ష్మీ లే అవుట్‌లో ఈ ఘటన జరిగింది. యువతిపై దాడి జరుగుతున్న విషయం గమనించిన కాలనీలోని వ్యక్తి.. అతన్ని నిలదీశాడు. ఇది ఆ కుర్రాడికి ఇంకా కోపం తెప్పించింది. తమ వ్యవహారంలో కలుగచేసుకోవద్దంటూ వాగ్వాదానికి దిగాడు. ఆవేశంలో అతను అమ్మాయిని ఏం చేస్తాడోనని భయపడి.. గొడవను అడ్డుకున్న వ్యక్తి పోలీసులకు ఫోన్ చేశాడు. చివరికి పంచాయితీ PSకు చేరడంతో.. అక్కడ లవ్వర్స్‌కి కౌన్సెలింగ్ ఇచ్చారు.