అది నిరూపిస్తే.. రాజీనామా చేస్తా: చంద్రబాబుకు కొడాలి నాని సవాల్

Update: 2019-12-17 11:57 GMT

ఏపీ అసెంబ్లీలో రాజధానిపై మాటల తూటాలు పేలుతున్నాయి. చంద్రబాబు గ్రాఫిక్స్‌ చూపించి రాష్ట్ర ప్రజలను మోసగించారని వైసీపీ నేతలు మండిపడ్డారు. టీడీపీ హయాంలో జరిగిన అవకతవకలన్నింటినీ తమ ప్రభుత్వం బయటపెడుతుందన్నారు. రాజధాని కేవలం ఒక్క ప్రాంతానికే పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు వైసీపీ నేతలు. హైదరాబాద్‌ ను తానే నిర్మించానని చెప్పే చంద్రబాబు ఎయిర్‌ పోర్టు, ఔట్‌ రింగ్‌ రోడ్డుకు శంకుస్థాపన చేశారా అని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. ఆయన శంకుస్థాపన చేసినట్టు నిరూపిస్తే రాజీనామా చేసి వెళ్లిపోతానన్నారు.

Similar News