నిరాహార దీక్షలకు దిగిన అమరావతి రైతులు

Update: 2019-12-18 06:16 GMT

ఆంధ్రప్రదేశ్‌కి 3 రాజధానుల ప్రతిపాదనపై అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణం ఈ ప్రతిపాదన వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వెలగపూడి, వెంకటపాలెంలో వారంతా నిరాహార దీక్షలకు దిగారు. అటు మందడంలో రోడ్డుపైనే బైఠాయించారు. సచివాలయం వైపు వెళ్లే రహదారి కావడంతో ఎలాంటి ఉద్రిక్తత తలెత్తకుండా భారీగా పోలీసుల్ని మోహరించారు. పిల్లల భవిష్యత్ కోసం రాజధానికి భూములు ఇచ్చామని, తమకు ఇచ్చిన ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాల్సిందేనని రైతులు అంటున్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామంటున్నారు.

Similar News