ఏపీ రాజధానిపై కమిటీ నివేదిక వచ్చాకే తుది నిర్ణయం ఉంటుందన్నారు మంత్రి పేర్ని నాని. అసెంబ్లీలో కూడా జగన్ అదే విషయం స్పష్టం చేశారన్నారు.. లెజిస్లేటివ్ రాజధాని అమరావతిలో, జ్యుడిషియల్ రాజధాని కర్నూలులో, ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖలో ఉండొచ్చు అన్నారు.. ఉంటుంది అని చెప్పలేదు కాదా అని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలు ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకునే జగన్ నిర్ణయం తీసుకుంటురన్నారు.. చంద్రబాబులా సీఎం జగన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోరని పేర్ని నాని అభిప్రాయపడ్డారు.