రాజధాని ప్రజలకు ప్రభుత్వం న్యాయం చేయాలి: జీవీఎల్

Update: 2019-12-18 10:13 GMT

రాజధాని అంశంపై వైఎస్ చేసిన వ్యాఖ్యలుపై రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపధ్యంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్శింహారావు స్పందించారు. ఏపీ అభివద్ధి చెందాలంటే.. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని కానీ.. రాజధానుల వికేంద్రీకరణ కాదని అన్నారు. పరిపాలన రాజధాని ఏర్పాటు చేసినంత మాత్రాన ఆ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందని ఆశించలేమని అన్నారు. ఏపీలో అద్భుతమైన రాజధాని ఏర్పడాలని బీజేపీ కోరుకుంటోందని మరోసారి చెప్పారు‌. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని అన్నారు.

Similar News