ఇన్నాళ్లు కుల మతాల మధ్య వైసీపీ నేతలు చిచ్చు పెట్టారని.. ఇప్పుడు ప్రాంతాల మధ్య విభేదాలు రాజేశారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. సీఎం జగన్ తన బ్రాండ్‌ను ప్రజలు గుర్తు పెట్టుకునేందుకు వినాశకర పంథాను ఎంచుకున్నారని విమర్శించారు. మూడు రాజధానుల ప్రకటనపై వెంటనే కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు బుద్దా వెంకన్న. నిన్న జగన్ ప్రకటన చూశాక ప్రజల్లో భయాందోళన నెలకొందని అన్నారాయన.