వైద్యుల నిర్లక్ష్యం.. శిశువు మొండెం నుంచి వేరైన తల

Update: 2019-12-20 09:03 GMT

నాగర్‌ కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. అచ్చంపేట ప్రభుత్వాసుపత్రి వైద్యులు... ప్రసవం సరిగా చేయకపోవడంతో... శిశువు మొండెం నుంచి తల వేరైంది. అటు... బాలింత స్వాతి పరిస్థితి సైతం విషమంగా మారింది. దీంతో హుటాహుటిన స్వాతిని హైదరాబాద్‌ జడ్జీఖానా ఆసుపత్రికి పంపారు వైద్యులు. ప్రస్తుతం స్వాతి పరిస్థితి విషమంగా ఉందంటున్నారు వైద్యులు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల స్వాతి పరిస్థితి విషమంగా మారిందంటూ అచ్చంపేట ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.