రాజధాని ప్రాంతంలో జనసేన నాయకులు పర్యటిస్తున్నారు. రైతులు, గ్రామస్థులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. పార్టీ ముఖ్యనేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు సహా మరికొందరు శుక్రవారం 29 గ్రామాల పరిధిలో తిరిగి స్థానికులతో మాట్లాడనున్నారు. అమరావతినే రాజధానిగా ఉంచాలన్న డిమాండ్‌కు జనసేన ఇప్పటికే మద్దతు ప్రకటించింది. ముఖ్యమంత్రికి జీఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చాక.. అందులో ఉన్న అంశాలను బట్టి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు.