భారత్ త్వరలోనే 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇందుకోసం తమ ప్రభుత్వం పునాదులు వేసిందని తెలిపారు. 2014 వరకు భారత ఆర్థిక పరిస్థితి ఆగమ్యగోచరంగా వుండేదన్నారు. ఆ పరిస్థితి నుంచి దేశాన్ని గట్టెక్కించామన్నారు. అసోచామ్ వందవ వార్షిక సదస్సులో పాల్గొన్న మోదీ.. భారత్ ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని అన్నారు.