పదవికి రాజీనామా చేసి పోలీస్ వ్యవస్థలోకి వెళ్లాలని ఉంది: ఎంపీ గోరంట్ల మాధవ్

Update: 2019-12-20 06:28 GMT

టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఫైర్ అయ్యారు. బూట్లు నాకమని చెప్పేందుకు మనసు ఎలా వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అహర్నిశలు చమటోడ్చి సమాజం కోసం పని చేస్తున్నది పోలీసులేనన్నారు. పోలీసులు బూట్లంటే యుద్ధంలో ఆయుధాలన్న గోరంట్లమాధవ్‌.. వాటిని ముద్దాడారు.

గతంలో తాను ఒక్కసారి మీసం తిప్పితే ఎంపీ అయ్యానని, జేసీ బజారున పడ్డారన్నారు గోరంట్ల మాధవ్‌. సీఎం జగన్‌ తనకు మరో అవకాశం ఇస్తే ఎంపీకి రాజీనామా చేసి పోలీసు వ్యవస్థలోకి రావాలని ఉందన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన జేసీ లాంటి వారి ఆట కట్టించాలని ఉందన్నారు. జేసీ అంత నీచంగా మాట్లాడుతుంటే చంద్రబాబు అడ్డుకోలేకపోయారంటూ ఫైర్‌ అయ్యారు గోరంట్ల మాధవ్‌.

Similar News