ఒక్క నిమిషంలో ఆందోళనను విరమింపజేసిన పోలీస్ ఆఫీసర్

Update: 2019-12-20 06:49 GMT

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. గత కొన్ని రోజులుగా యూపీ, గుజరాత్, కర్నాటక, బెంగాల్ సహా.. పలు రాష్ట్రాలు అట్టుడికిపోతున్నాయి. పోలీసుల కాల్పుల్లో ఇప్పటికే పలువురు మరణించారు. యూపీ, కర్నాటకల్లోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ నిలిపేశారు. ఇదిలావుంటే, అసోంలో మాత్రం ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించారు. ఢిల్లీ మెట్రో సేవలు కూడా పాక్షికంగా ప్రారంభమయ్యాయి.

ఇదిలావుంటే, సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను నిలువరించడానికి ఓ పోలీస్ ఆఫీసర్ డిఫరెంట్ గా ఆలోచించాడు. ఆందోళనకారుల్లో దేశభక్తిని తట్టిలేపే ప్రయత్నం చేశారు. దీంతో అప్పటిదాకా నినాదాలు చేసినవారంతా మౌనంగా అక్కడి నుంచి తిరుగుముఖం పట్టారు. ఇంతకీ, ఆ పోలీస్ అధికారి చేసిన ప్రయత్నమేంటో మీరూ చూడండి.

ఈ పోలీస్ అధికారి పేరు చేతన్ సింగ్ రాథోడ్. బెంగళూరులో డీసీపీగా పనిచేస్తున్నారు. సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న ఆందోళనకారులను అడ్డుకోవడానికి ట్రై చేశారు. వారిని అడ్డుకోవడానికి తన టీమ్ తో శాయాశక్తులా ప్రయత్నించారు. కానీ, ఆందోళనలు ఏమాత్రం తగ్గలేదు. వీరిని ఎలా అడ్డుకోవాలని ఆలోచిస్తున్న ఆయనకు చటుక్కున ఓ ఆలోచన వచ్చింది. వెంటనే జాతీయ గీతాన్ని ఆలపించి.. ఆందోళనకారుల్లో దేశభక్తిని రగిలించే ప్రయత్నం చేశాడు. అంతే.. అప్పటిదాకా ఆందోళన చేస్తున్నవారంతా డీసీపీతో గొంతు కలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Similar News