ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు.. సీఏఏ వ్యతిరేక ఆందోళనలు రైల్వే శాఖ కొంపముంచాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా.. దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతూనేవున్నాయి. నిరసనకారులు రైళ్లు, రైల్వే స్టేషన్లు, ట్రాకులు వేటినీ వదలడం లేదు. రైలు పట్టాలపై ప్రతాపం చూస్తున్నారు. ట్రైన్లపై రాళ్ల దాడులు చేస్తున్నారు. రైల్వే స్టేషన్లలో వీరంగం సృష్టిస్తున్నారు. దీంతో ఇప్పటికే రైల్వే ఆస్తులు చాలా వరకు ధ్వంసం అయ్యాయి.
నిరసనలతో ఏకంగా 88 కోట్ల రైల్వే ఆస్తులు ధ్వంసమైనట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఒక్క తూర్పు రైల్వే జోన్‌లోనే సుమారు 72 కోట్ల ప్రాపర్టీ ధ్వంసమైనట్లు రైల్వే శాఖ తెలిపింది. ఇక, సౌత్ ఈస్ట్రన్ రైల్వే జోన్‌లో మరో 13 కోట్ల రైల్వే ఆస్తులు ధ్వంసం అయ్యాయి. నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ జోన్‌లో 3 కోట్ల మేర రైల్వే ప్రాపర్టీ డ్యామేజ్ అయినట్టు రైల్వే శాఖ చెబుతోంది.