ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. తొమ్మిది మంది మృతి

Update: 2019-12-23 04:16 GMT

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కిరారి ప్రాంతంలోని ఓ వస్త్ర గోదాంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. మరో 10మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం సంజయ్ గాంధీ మెమోరియల్‌ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

Similar News