ప్రధాని మోదీకి అమరావతి రైతుల లేఖలు

Update: 2019-12-24 08:52 GMT

అమరావతిలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. జి.ఎన్‌ రావు కమిటీ నివేదికపై రైతులు నిప్పులు చెరుగుతున్నారు. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తే ఊరుకోమంటూ హెచ్చరిస్తూ.. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. రాజధాని రైతులంతా రోడ్డుపైకి వచ్చి వారం రోజులు అవుతున్నా.. ఏపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కేంద్రాన్ని ఆశ్రయిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోదీకి భారీ సంఖ్యలో రాజధాని రైతుల లేఖలు రాశారు. రాజధాని విషయంలో తమకు జరిగిన అన్యాయంపై మూడు పేజీల లేఖలు రాశారు. ఆ లేఖలకు తమ ఆధార్‌ జిరాక్స్‌లను జోడించారు. మూడు రాజధానుల నిర్ణయంపై వెంటనే ప్రధాని జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ స్పీడ్‌ పోస్టులో ప్రధాని కార్యాలయానికి లేఖలు పంపారు.

Similar News