ఢిల్లీలో మరో భారీ అగ్నిప్రమాదం

Update: 2019-12-24 05:29 GMT

ఢిల్లీలో మరో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నరేలా ప్రాంతంలోని షూ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున చెలరేగిన మంటలకు పక్కనే ఉన్న మరో రెండు ఫ్యాక్టరీలకు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 22 ఫైరింజన్లతో మంటలు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. . ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. ఫ్యాక్టరీలో సిలిండర్ పేలడంతో ఈప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Similar News