రాజధాని రైతులపై ఇటీవల మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అమరావతిలో ఆందోళనలు చేస్తన్న రైతుల ఉద్యమాన్ని చిన్నదిగా చూపేలా వీరి తీరు ఉందన్న విమర్శలు వెల్లువెత్తాయి.
మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలతో మనస్తాపం చెందిన ఓ రైతు నేరుగా ఆయనకే ఫోన్ చేశారు. ఇంత అధర్మంగా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. దీంతో.. ఆ రైతును సముదాయించే ప్రయత్నం చేసిన ధర్మాన.. విజయవాడ వచ్చినప్పుడు ఆయన్ను కలుస్తానన్నారు.