తూర్పుగోదావరి జిల్లాలో మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు. కోరుకొండ మండలం గాదరాద గ్రామంలో మూడో తరగతి బాలికపై అదే గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ యువకుడు అత్యాచారం చేశాడు. బాధితురాలి అమ్మమ్మ ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. బాధితురాలిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.