పులివెందులలో వైఎస్సార్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభించిన సీఎం

Update: 2019-12-25 08:04 GMT

ఏపీ సీఎం జగన్‌ పులివెందులలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలో మొత్తం 1329 కోట్లతో తొలి దశ అభివృద్ధి పనులకు చేపడుతున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. అనంతరం.. 347 కోట్ల నిర్మించనున్న మెడికల్‌ కాలేజీకి శంకుస్థాపన చేశారు. పులివెందులతో మోడల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

వాటర్‌ గ్రిడ్‌ ద్వారా ప్రతి ఇంటికి మంచి నీరు అందిస్తామన్నారు. గండికోట రిజర్వారాయర్‌ దిగువన 20 టీఎంసీల నిల్వతో డ్యాం నిర్మిస్తామన్నారు. తన తండ్రిని అమితంగా ప్రేమించారని, ఇప్పుడు తన వెంటే ఉన్నందుకు నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు సీఎం జగన్‌.

Similar News