హైదరాబాద్‌లో నేరాలు తగ్గాయి : సీపీ అంజనీ కుమార్‌

Update: 2019-12-26 08:31 GMT

హైదరాబాద్‌లో గతేడాదితో పోల్చితే ఈసారి నేరాలు తగ్గాయన్నారు నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 9 శాతం నేరాలు తగ్గాయని... క్రైమ్‌ వార్షిక నేర వివరాలు వెల్లడించారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు సీపీ. చైన్‌స్నాచింగ్‌ కేసులు 30 శాతం తగ్గగా.. ఆపరేషన్ స్మైల్‌- ముస్కాన్‌ ద్వారా 874 మంది చిన్నారులను కాపాడామన్నారు. నివాసయోగ్య నగరాల్లో హైదరాబాద్‌ నంబర్‌ వన్‌గా ఉందన్నారు. పలు మతాల ఉత్సవాలు, కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయన్నారు. నేరాలు తగ్గించడానికి ఆపరేషన్ చబుత్ర ఉపయోగపడిందన్నారు. అయితే గత ఏడాదితో పోల్చితే ఈసారి డ్రైంక్ అండ్‌ డ్రైవ్‌ కేసులు పెరిగాయన్నారు సీపీ.

Similar News