సూర్యగ్రహణానికి సంబంధించిన ఆసక్తికర ఫొటోలను ట్విట్టర్లో ఫోస్ట్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. భారతీయులందరిలాగే.. తాను కూడా సూర్య గ్రహణాన్ని చూసేందుకు ప్రయత్నించానంటూ ట్వీట్ చేశారు. మబ్బులు పట్టడం వల్ల.. గ్రహణాన్ని చూడలేకపోయానన్నారు. అయితే గ్రహణానికి సంబంధించిన ఫొటోలను ఆన్‌లైన్‌లో తిలకించానని తెలిపారు. కోజికోడ్ తదితర ప్రాంతాల్లో కనిపించిన గ్రహణాన్ని చూశానన్నారు. దీంతో పాటు గ్రహణానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను నిపుణుల ద్వారా తెలుసుకున్నానని ట్విట్టర్‌లో తెలిపారు ప్రధాని మోదీ.