అసోంలో పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ర్యాలీలు కొనసాగుతున్నాయి. గోల్పారాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఏఏకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. పౌరసత్వ సవరణ బిల్లు అసోం అస్తిత్వాన్ని దెబ్బతీస్తుందని మండిపడుతున్నారు. వెంటనే పౌరసత్వ బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.