ప్రియాంక గాంధీపై యూపీ పోలీసుల తీరును నిరసిస్తూ ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. యూపీ భవన్‌ను కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. భారీగా మోహరించిన పోలీసులు.. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. యోగి ప్రభుత్వం ప్రియాంక గాంధీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో సీఏఏ ర్యాలీలో గాయపడ్డ వారిని పరామర్శించేందుకు వెళ్లిన ప్రియాంకను.. ఉత్తరప్రదేశ్ పోలీసులు అడ్డుకోవడం రాజకీయ దుమారం రేపుతోంది.