రైతుల అరెస్ట్‌పై టీడీపీ భగ్గుమంటోంది. రాజధానికి భూములిచ్చిన రైతుల్ని అరెస్ట్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరు సబ్ జైలుకు రానున్నారు. రైతుల్ని పరామర్శించనున్నారు. అటు.. ఇప్పటికే టీడీపీ నేతలు పుల్లారావు, నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజాతో పాటు పలువురు టీడీపీ నేతలు సబ్ జైలులో రైతుల్ని పరామర్శించారు. రైతుల అరెస్టుకు నిరసనగా జైలు ముందు అఖిలపక్ష నాయకుల ఆందోళన నిర్వహించారు. రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సబ్ జైలు ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భూములిచ్చిన రైతులు రాజధానిని అడిగితే తప్పా అంటూ ప్రశ్నించారు.