కారుణ్య మరణానికి అనుమతించాలని రాష్ట్రపతికి లేఖ రాసిన అమరావతి రైతులు

Update: 2019-12-31 16:20 GMT

రాష్ట్రపతికి రాజధాని రైతులు లేఖ రాశారు. కారుణ్య మరణానికి అనుమతించాలని లేఖలో కోరారు. సీఎం నిర్ణయాలతో తామంతా రోడ్డున పడ్డామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చాక జగన్‌ మాట మార్చారన్నారు. ముఖ్యమంత్రి, పలువురి స్వలాభం కోసం రాజధానిని విశాఖకు తరలించే కుట్ర చేస్తున్నారని అమరావతి రైతులు లేఖలో పేర్కొన్నారు. 14 రోజులుగా ఆందోళన చేస్తున్నా తమను ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలు మా త్యాగాలను అవహేళన చేస్తున్నారని రాష్ట్రపతికి తాము పడుతున్న బాధలను విన్నవించుకున్నారు. అర్థరాత్రి మా ఇళ్లపైకి పోలీసులను పంపి అరెస్టులు చేస్తున్నారని.. అండగా నిలవాల్సిన ప్రభుత్వమే మాపై కక్ష కట్టిందని లేఖలో పేర్కొన్నారు. రాజధాని పొతే తాము జీవచ్ఛవాలుగా మిగిలిపోతామని.. మరణమే శరణ్యమంటూ రాష్ట్రపతికి లేఖలో తమ ఆవేదనను వెళ్లబోసుకున్నారు రాజధాని ప్రాంత రైతులు.

Similar News