నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో ఏటీఎం చోరీకి గురైంది. వెలిమినేడు గ్రామంలో ఉన్న ఇండిక్యాష్ ఏటీఎం దగ్గర రాత్రి సెక్యూరిటీ లేకపోవడంతో.. ఏటీఎంపై కన్నేశారు దుండగులు. వెంటనే తమతో పాటు తెచ్చుకున్న గ్యాస్ సిలిండర్ కట్టర్‌తో ఏటీఎంను కట్ చేశారు.. ఏటీఎం డోర్స్ ఓపెన్ అవ్వడంతో.. లోపల ఉన్న భారీ నగదును దోచుకెళ్లారు. ఉదయాన్ని చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగల కోసం గాలిస్తున్నారు.