ఏపీ రాజధాని అమరావతి తరలింపుపై ఉత్కంఠ వీడలేదు. వరుస కమిటీల రిపోర్టులతో రోజుకు ఓ కింత ఆందోళన పెరుగుతూనే ఉంది. ఏ కమిటీ ఏం రిపోర్ట్ ఇస్తుంది? అసలు ప్రభుత్వం ఎందుకు రాజధానిపై గత ప్రభుత్వం కంటే భిన్నంగా ఆలోచిస్తోంది. దీనికి ప్రభుత్వం చెప్పే సమాధానం పాలన వికేంద్రీకరణ ఒకటైతే..రెండో సమాధానం అవినీతి. రాజధాని ప్రాంతంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందనేది అధికార పార్టీ మొదట్నంచి వినిపిస్తున్న ఆరోపణ. ఆ తర్వాత పాలన వికేంద్రీకరణ పాయింట్ తో రాజధానిపై వాదనలు వినిపించింది. ఇక ఇప్పుడు మళ్లీ ఇన్ సైడ్ అస్త్రంతో వచ్చింది. రాజధాని ప్రాంతాన్ని ముందుగానే నిర్ణయించి వందల ఎకరాల్లో కొనుగోలు చేశాక రాజధాని పేరు ప్రకటించారన్నది వైసీపీ ఆరోపణ. ఇన్ సైడ్ ట్రేడింగ్ కు సంబంధించి వీడియోలను ప్రజెంట్ చేశారు.
వైసీపీ విమర్శలకు అంతే రేంజ్ లో కౌంటర్ ఇచ్చింది టీడీపీ. అమరావతిలో భూముల కొనుగోళ్లపై వైసీపీ పదే పదే అవాస్తవాలు చెబుతోందన్నారు టీడీపీ అధికార ప్రతినిది బోండా ఉమ. రెండు జిల్లాలో జరిగిన ప్రతి కొనుగోలును టీడీపీకి అంటగడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎప్పుడంటే అప్పుడు చర్చకు సిద్ధమన్నారాయన.
రాజధాని తరలింపు నిర్ణయంపై 29 మండలాల ప్రజలు ఒక్కటిగా నిలబడి ప్రభుత్వంతో కలబడుతున్న వేళ ఇన్ సైడ్ ట్రేడింగ్ ను హైలెట్ చేస్తూ అమరావతిలో అవినీతి పాయింట్ ను రెయిస్ చేస్తోంది వైసీపీ. అందుకే తప్పక రాజధానిని తరలిస్తున్నామనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. అయితే..ధీటుగా కౌంటర్ ఇస్తున్న టీడీపీ..అవినీతి జరిగితే ప్రూఫ్ చేయాలని సవాల్ విసురుతోంది.