ఏపీలో రాజధాని తరలింపుపై పొలిటికల్ వార్ కంటిన్యూ

Update: 2020-01-06 02:47 GMT

ఏపీ రాజధానిపై ఆందోళనలు మరింత ఉద్ధృతం అవుతున్న వేళ.. పొలిటికల్ వార్ కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. ఏపీలో రాజధాని అంశంపై జగన్ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. అమరావతి తరలింపునకు వ్యతిరేకంగా తమ పార్టీ త్వరలోనే ఓ కార్యాచరణ సిద్ధం చేస్తుందని చెప్పారాయన. రాజధాని మహిళలపై పోలీసుల వైఖరిని ఖండించారు.

అమరావతి రైతులకు అన్యాయం జరుగకూడదన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. రైతులు అక్కడ బాధపడుతుంటే ఇక్కడ తాము ఎలా ఆనందంగా ఉండగలమని ఆయన విశాఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనకు గురవుతున్న రైతులకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

జీఎన్‌రావు కమిటీ, బోస్టన్ కమిటీ ప్రభుత్వం చెప్పిందే చేశాయని ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. అమరావతి రైతులకు న్యాయం చేయాల్సిందేనని డిమాండ్ చేశారాయన. రాయలసీమకు హైకోర్టు మాత్రమే ఇచ్చి అన్యాయం చేశారన్నారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగాలంటే మూడు చోట్లా సచివాలయం, అసెంబ్లీ, న్యాయవ్యవస్థలు ఉండాలాన్నారు.

అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని కూడా ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. రాజధాని విశాఖపట్టణానికి రాకుండా టీడీపీ అడ్డుకుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు స్పీకర్‌ తమ్మినేని సీతారాం. రాజధాని కోసం అవసరమైతే జైలుకు వెళ్లేందుకు సిద్ధమన్నారు చంద్రబాబు..

అయితే...ఈ పొలిటికల్ వార్ ఎలా ఉన్నా..రాజధాని ఎక్కడ ఉండాలో అన్నది ఆయా రాష్ట్రాలకు సంబంధించి అంశమని అన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. అమరావతి అంశాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. రాజధానిపై పార్టీలు, ప్రాంతాలుగా విడిపోయిన లీడర్లు క్యాపిటల్ పై అఖిలపక్ష సమావేశం నిర్వమించాలని డిమాండ్ చేస్తున్నారు.

Similar News