ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తుకు గడువు 3 రోజులే..

Update: 2020-01-07 06:11 GMT

ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC గత నెలలో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్ధులు https://ssc.nic.in/వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్పి ఉంటుంది. అభ్యర్ధులను కేంద్ర ప్రభుత్వ శాఖలు, కార్యాలయాలు, సంస్థల్లో లోయర్ డివిజనల్ క్లర్క్, పోస్టల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. దరఖాస్తు గడువు జనవరి 10తో ముగుస్తుంది. ఆన్‌లైన్ ఫీజు చెల్లించడానికి ఆఖరు తేదీ జనవరి 12.

కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ మొదటి దశ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 2020 మార్చి 16 నుంచి 2020 మార్చి 27 మధ్య జరుగుతుంది. రెండో దశ పరీక్ష 2020 జూన్ 28న జరుగుతుంది. దరఖాస్తు చేసే అభ్యర్ధుల వయస్సు 2020 జనవరి 1 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, అన్‌రిజర్వ్‌డ్ వికాలాంగులకు 10 ఏళ్లు, అన్‌రిజర్వ్‌డ్ ఓబీసీలకు 13 ఏళ్లు, అన్‌రిజర్వ్‌డ్ ఎస్సీ, ఎస్టీలకు 15 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు రూ.100. అభ్యర్థులు లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ (JSA), పోస్టల్ అసిస్టెంట్ (PA), సార్టింగ్ అసిస్టెంట్ (SA), డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) పోస్టులకు 12వ తరగతి పాస్ కావాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ పోస్టులకు సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్‌తో 12వ తరగతి పాసై ఉండాలి.

Similar News