అమరావతినే రాజధానిగా కొనసాగించాలి : సీమవాసుల డిమాండ్

Update: 2020-01-11 05:07 GMT

అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్న డిమాండ్ రాయలసీమలోనూ బలంగా వినిపిస్తోంది. ఇవాళ తిరుపతిలో JAC భారీ ర్యాలీకి సన్నాహాలు చేసింది. మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి చేరుకోనున్న చంద్రబాబు ఈ ర్యాలీలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో పోలీసులు టీడీపీ నేతలను, ఉద్యమకారులను ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు. మాజీ మంత్రి అమర్నాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా మాజీ చైర్మన్ నరసింహ యాదవ్‌లను గృహనిర్బంధంలోనే ఉంచారు.

రాజధానిగా అమరావతి అవసరాన్ని వివరిస్తూ ప్రజల్లో చైతన్యం నింపే లక్ష్యంతో JAC యాత్రలు చేస్తోంది. ఐతే.. పోలీసులు అఖిలపక్ష సమావేశానికి కూడా అడ్డుకుంటున్నారు. మీటింగ్‌కి ఎవరూ హాజరు కాకుండా ముందస్తు ముందస్తు అరెస్టులు చేశారు. టీడీపీ, జనసేన, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ప్రజా సంఘాల ప్రతినిధులంతా తాజా పరిణామాలపై ఆగ్రహంతో ఉన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సాయంత్రం ర్యాలీ జరిపితీరతామంటున్నారు. అమరావతిని రాజధానిగా చేయాలన్న ఏకవాక్య తీర్మానంతోనే తాము ముందుకు వెళ్తామంటున్నారు.

Similar News