ప్రధాని పదవికి ఓలెక్సీ రాజీనామా.. తిరస్కరించిన అధ్యక్షుడు

Update: 2020-01-18 14:12 GMT

ఉన్నత పదవిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. చపలచిత్తం ప్రదర్శిస్తే పదవికి ఎసరు పడుతుంది. ఉక్రెయిన్‌లో అదే జరిగింది. ప్రధాని పదవికి ఓలెక్సీ గోంచారక్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని అధ్యక్షుడు వ్లోదిమర్ జెలెన్‌స్కీకి అందచేశారు. ఐతే, ఈ రాజీనామాను అధ్యక్షుడు ఆమోదించలేదు. ప్రధానికి మరో అవకాశమిస్తున్నానని ప్రెసిడెంట్ ప్రకటించారు.

వ్లోదిమిర్ జెలెన్‌స్కీపై ఓలెక్సీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్లోదిమర్ ఓ కమేడియన్ అని పేర్కొన్నారు. ఆయనకు ఆర్థిక వ్యవస్థపై అవగాహన లేదని విమర్శించారు. రాజకీయంగా ఎలాంటి అనుభవం లేదని ఎద్దేవా చేశారు. ఆర్థికవేత్తలు, బ్యాంకు అధికారులతో మీటింగ్ తర్వాత ఓలెక్సీ అన్న మాటలు తీవ్ర దుమారం రేపాయి. జెలెన్‌స్కీపై వ్లోదిమర్ వ్యాఖ్యల ఆడియో టేపులు కలకలం సృష్టించాయి. వ్లోదిమర్ తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. అధ్యక్షుడిపై బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయవచ్చా అని నిలదీశారు. తప్పును గుర్తించిన వ్లోదిమర్ తన పదవికి రాజీనామా చేశారు. ఐతే, ఆ రాజీనామాను అధ్యక్షుడు తిరస్కరించారు.

 

Similar News