చీకట్లోనే ప్రచారం నిర్వహించిన కిషన్‌రెడ్డి

Update: 2020-01-19 16:04 GMT

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వనపర్తిలో కిషన్‌రెడ్డి ప్రచారం చేస్తుండగా కరెంట్ పోయింది. ప్రచారం ప్రారంభించి 5 నిమిషాలకే ఐమాస్ లైట్లు, స్ట్రీట్ లైట్లు ఆగిపోయాయి. ఇదే విషయా న్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోలేదని బీజేపీ నేతలు ఆరోపించారు. దాంతో, చీకట్లోనే కిషన్‌రెడ్డి ప్రచా రం చేశారు.

టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యమయ్యాయని కిషన్ రెడ్డి మండిపడ్డారు. మున్సిపాలిటీల అభివృద్ధి ని కేసీఆర్ సర్కారు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధికి ఆమడ దూరంలో నిలి చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతకుముందు, రంగారెడ్డి జిల్లా కోకాపేటలో కిషన్ రెడ్డి ప్రచారం చేశారు. అపార్ట్‌మెంట్‌ ప్రజలను కలసి ముచ్చటించా రు. స్థానికుల సాదకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీలను కాస్తో కూస్తో అభివృద్ధి చేసింది కేంద్ర ప్రభుత్వమేనని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 2 లక్షల ఇళ్లు కేటాయించిందని గుర్తు చేశారు.