రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతుల ఆందోళనలు 37వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు , వెలగపూడితో పాటు ఇతర గ్రామాల్లో ధర్నాలు, నిరసనలు, దీక్షలు కొనసాగుతున్నాయి. మండలిలో వికేంద్రీకరణ, CRDA రద్దు బిల్లులు సెలక్ట్ కమిటీకి పంపిస్తూ ఛైర్మన్ షరీఫ్ నిర్ణయం పట్ల అమరావతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండలి చైర్మన్ షరీఫ్‌కు పాలాభిషేకం చేశారు. వికేంద్రీకరణ బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకునేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు.
అలాగే గురువారం నుంచి మందడంలో అసైన్డ్ రైతులు 24 గంటల పాటు నిరవదిక దీక్ష చేయనున్నారు. మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లులు వీగిపోవడంతో తదుపరి ఉద్యమకార్యాచరణను జేఏసీ రూపొందించింది. మండలి చైర్మన్ షరీఫ్‌కు పాలాభిషేకం చేయనున్నారు.