రూ.30 వేలు కావాలంటే పత్తి సాగు.. రూ.3 లక్షలు కావాలంటే పట్టు ఉత్పత్తి : హరీష్ రావు
వ్యవసాయానికి ఆధునిక సౌకర్యాలు జోడించి తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి సాధించాలని పిలుపునిచ్చారు మంత్రులు నిరంజన్ రెడ్డి, హరీష్ రావు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలో జరిగిన రాష్ట్ర పట్టు రైతుల సమ్మేళనంలో మంత్రులు పాల్గొన్నారు. 30 వేలు కావాలంటే పత్తి సాగు..3 లక్షలు కావాలంటే పట్టు ఉత్పత్తి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన సెరికల్చర్ పై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు.
అంతకుముందు సిద్దిపేట నియోజకవర్గంలోని పుల్లూరు బండ జాతరలో మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. ఈ జాతరకు ప్రతి ఏడు లాగే.. ఈ సారి కూడా మంత్రి హరీష్ హాజరై.. లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. సిద్ధిపేట నుంచి పుల్లూరు వచ్చే దారిలో 10 లక్షల రూపాయలతో ఏర్పాటైన ఆలయస్వాగత తోరణాన్ని ప్రారంభించారు. సూడా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్క్‌ను ప్రారంభించారు. కల్యాణ మండపానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. త్వరలోనే పుల్లూరు బండను గోదావరి జలాలు తాకుతాయమన్నారు మంత్రి అన్నారు. గోదావరి జలాలతో లక్ష్మీ నృసింహస్వామికి అభిషేకం చేద్దామన్నారు.
ఇక మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ మేడారం సమ్మక్క, సారాలమ్మను దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ సారి జాతర గతేడాది కంటే విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. రాబోయే మేడారం జాతర నాటికి శాశ్వత నిర్మాణాలు చేపడతామన్నారు. ఈ మేడారం జాతరను ప్లాస్టిక్ రహితంగా జరుపుకోవాలని మంత్రులు పిలుపునిచ్చారు.
అంతకుముందు మేడారం మూలుగు జిల్లా తాడ్వాయి మండలంలో హరిత హొటల్ ను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. మాజీ ఎంపీ కవిత, ఎమ్మెల్యే సీతక్క ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.