జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌

Update: 2020-01-26 13:34 GMT

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవాన్ని విజయవాడలో నిర్వహించింది. గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం.. పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమంపై 14 శకటాల ప్రదర్శన నిర్వహించారు.

విజయవాడలో జరిగిన గణతంత్ర వేడుకల్లో గవర్నర్‌ హరిచందన్‌తో పాటు.. ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి, సీఎస్ సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్‌ హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను తన ప్రసంగంలో వివరించారు గవర్నర్. మూడు రాజధానులనూ ప్రస్తావించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

Similar News