ఇండియన్ కోస్ట్ గార్డ్ నావిక్ జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 260 పోస్టుల భర్తీకి గాను యువకుల నుంచి మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తుంది. రాత పరీక్ష, ఫిట్‌నెస్ టెస్ట్ ద్వారా అభ్యర్ధుల ఎంపిక జరుగుతుంది. ఆసక్తిగల అభ్యర్ధులు ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారిక వెబ్‌సైట్ www.joinindiancoastguard. gov.in ఓపెన్ చేసి దరఖాస్తు చేయాలి. జనవరి 26 నుంచి ఫిబ్రవరి 2 మధ్య దరఖాస్తు చేసుకోవాలి.
వివరాలు:
నావిక్ జనరల్ డ్యూటీ పోస్టులు: 260, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2020 జనవరి 26, దరఖాస్తుకు చివరి తేదీ: 2020 ఫిబ్రవరి 2, అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్: 2020 ఫిబ్రవరి 15 నుంచి 22, పరీక్ష: 2020 ఫిబ్రవరి లేదా మార్చి విద్యార్హత: మ్యాథ్స్, పిజిక్స్ సబ్జెక్టులతో 10+2 పాస్ కావాలి. వయసు: 18 నుంచి 22 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది. ఇతర వివరాలకు వెబ్‌సైట్: www.joinindiancoastguard.gov.in.